జాము రేతిరి యేళ జడుపూ గిడుపు మాని, సెట్టూ పుట్టా దాటి సేనులో నేనుంటే
జాము రేతిరి యేళ జడుపూ గిడుపు మాని, సెట్టూ పుట్టా దాటి సేనులో నేనుంటే
మెల్లంగా వస్తాది నా యెంకీ!
సల్లంగా వస్తాది నా యెంకీ!
మెల్లంగా వస్తాది నా యెంకీ!
సల్లంగా వస్తాది నా యెంకీ!
పచ్చని సేలోకి పండు యెన్నోలోన, నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటే
పచ్చని సేలోకి పండు యెన్నోలోన, నీలి సీరాగట్టి నీటుగొస్తావుంటే
వొయ్యార మొలికించు నా యెంకీ!
వొనలచ్చి మనిపించు నా యెంకీ!
వొయ్యార మొలికించు నా యెంకీ!
వొనలచ్చి మనిపించు నా యెంకీ!
యెంకి వస్తాదని యెదురుగా నేబోయి, గట్టు మీద దాని కంటి కాపడగానే
యెంకి వస్తాదని యెదురుగా నేబోయి, గట్టు మీద దాని కంటి కాపడగానే
కాలు కదపలేదు నా యెంకీ!
కరిగి నీరౌతాది నా యెంకీ!
కాలు కదపలేదు నా యెంకీ!
కరిగి నీరౌతాది నా యెంకీ!
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి, గోనేపట్టా యేసి గొంగడి పైనేసి
మాటలన్నీ సెప్పి మంచెకిందా కెల్లి, గోనేపట్టా యేసి గొంగడి పైనేసి
కులాసగుంటది నా యెంకీ!
కులుకు సూపెడతాది నా యెంకీ!
కులాసగుంటది నా యెంకీ!
కులుకు సూపెడతాది నా యెంకీ!
యేతా మేత్తేకాడ యెదురూగ కూకుండి, మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతుంటే
యేతా మేత్తేకాడ యెదురూగ కూకుండి, మళ్ళీ ఎప్పటల్లే తెల్లారబోతుంటే
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ!
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ!
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ!
సెందురుణ్ణీ తిట్టు నా యెంకీ!
సూరియుణ్ణీ తిట్టు నా యెంకీ!
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri