Kishore Kumar Hits

R. P. Patnaik - Cheliya Cheliya şarkı sözleri

Sanatçı: R. P. Patnaik

albüm: Allari Ramudu


చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదన
కన్నుగీటి పిలవగానే పరుగున రానా
ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము
రస సీమలో చేయనా పరిపాలనం
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదన
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

వయ్యారి ఈ చిన్నది పడకటింటి కయ్యాని కొస్తున్నది
ఓరయ్యో కామయ్యె ఏంచేసినావయ్యో నాకేదో అవుతున్నది
మనసైన మాగధీరుడు అయ్యయ్యో అయ్యారే సుకుమారుడు
ఈ ప్రేమ పాటలు నీ చేతి వాటాలు నే చేసి చూపించని
యతి కూడ మతిపోయి జతకోరగా
రతియోగమంటాను జపియించగా
ఈ తీయని అల్లరి చేస్తుంది నా
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

జేగంట మోగించని చిన్నదాన్ని జాగారం చేయించని
లేలేత అందాల గంధాలు తీయించి గ్రంధాలు రచియించని
నా ముడుము చెల్లించని చెప్పరాని పాటలు వల్లించని
శ్రీగీత గోవింద శృంగార శ్లోకాల గానాలు సాగించని
కన్నయ్య అలివేణి ఆ రాధిక
కానయ్యా పోదయ్య అనరాదిక
మది మురళిని సరళిలో రవలించగా
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదనా
కన్నుగీటి పిలవగానే పరుగున రానా
ప్రియురాలు ఇచ్చింది పెదవి లంచము
దొరగారి కౌగిలే నా ప్రపంచము
రస సీమలో చేయనా పరిపాలనం
చెలియా చెలియా చెలియా చెలియా
చెంత చేరి జంట కడితే చెలియా గిలియా
మదనా మదనా సుందర వదన
కన్నుగీటి పిలవగానే పరుగున రానా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar