Kishore Kumar Hits

Kalyani Malik - Veluthunna şarkı sözleri

Sanatçı: Kalyani Malik

albüm: Boss


వెళుతున్న వెళుతున్నా
మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా

వెళుతున్న వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా
నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా
నా కలలు నీ దారిలో పారేసి వెళుతున్నా
నా కన్నీళ్లను నీ గుమ్మంలో ముగ్గేసి వెళుతున్నా
వెళుతున్న వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

ఒకే పెదవితో పదములు ఎప్పుడు పలకవనీ
ఒకే పదముతో పరుగులు ఎప్పుడు సాగవనీ
ఒకే చేతితో చప్పట్లన్నవి మోగవనీ
ఒకే మనసుతో ముచ్చట్లన్నవి తీరవనీ
జతలోన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
జతలోన రెండు మనసులు ఉండాలి ఎపుడైనా
ఇక పైన నేనే రెండుగా విడిపోయి వెళుతున్నా
వెళుతున్న వెళుతున్నా మౌనంగా వెళుతున్నా
వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా

వస్తున్న వస్తున్నా నీ కోసం వస్తున్నా
నీలోన దాగున్న నా కోసం వస్తున్నా
నీ మౌనరాగంలో మంత్రమై వస్తున్నా
నీ ప్రేమయాగంలో జ్వాలనై వస్తున్నా
నీ మెడలోన నిత్యం నిలిచే సూత్రానై వస్తున్నా
అణువణువణువునా ఎగిసిన అలలను నేడే గమనిస్తున్నా
ఆ అలలను కలలుగామలిచిన మహిమే నీదని గుర్తిస్తున్నా
కలలకు వెల్లువ రప్పించి
ఊహకు ఉప్పెన అందించి
ఆశల అలజడి పుట్టించి
అన్నింటిని ప్రేమకి జత చేసి
నీ మది నది చేరగా కడలిని నేనై కదిలోస్తున్నా
నీ మౌనరాగంలో మంత్రమై వస్తున్నా
నీ ప్రేమయాగంలో జ్వాలనై వస్తున్నా
నీ మెడలోన నిత్యం నిలిచే సూత్రానై వస్తున్నా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar