ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆడించి అష్టాచమ్మా ఓడించావమ్మా నీ పంట పండిందే ప్రేమా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఆ మాటె అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఓ... ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా హ్మ్... ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా చూశాక నిన్ను, వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకోను ఏం చెప్పుకోను, ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను నువ్వేసే గవ్వలాటలో, నిలేసే గళ్ళ బాటలో నీ దాకా నన్ను రప్పించ్చింది నువ్వే లేవమ్మా నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే ఓ... నా నేరం ఏఁవుందే ఏం చెప్పిందో నీ తల్లో జేజెమ్మా హ్మ్... మందారం అయ్యింది ఆ రోషం తాకి జళ్ళో జాజమ్మా పూవ్వంటి రూపం నాజుగ్గా గిల్లి, కెవ్వంది గుండె నిన్న దాకా ముళ్ళంటి కోపం ఒళ్ళంతా అల్లి, నవ్వింది నేడు ఆగలేక మన్నిస్తే తప్పేం లేదమ్మా మరీ ఈ మారం మానమ్మా ఈ లావాదేవిలేవీ అంత కొత్తేం కాదమ్మా