Kishore Kumar Hits

Kalyani Malik - E Velalona şarkı sözleri

Sanatçı: Kalyani Malik

albüm: Cinema Chupista Mama (Original Motion Picture Soundtrack)

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా
ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా
మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా

నీలోన కలలు
నా కొంటె కనులు
ఆ చిలిపి పనులు చేసేయమన్నవే
నీ చూపు చాలు
ఓ మాట చాలు
ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే
లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే

ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా

ఆ జాబిలమ్మ
ఈ వెన్నెలమ్మ
ఓ కొత్త జన్మ అందిస్తున్నదే
నాలోని ఆశ
నీ పైన ధ్యాస
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే
పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar