చిత్రం: జ్యో అచ్యుతానంద (2016)
సంగీతం: కళ్యాణి మాలిక్ (కళ్యాణి కోడూరి)
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్
గానం: హరిణి రావు
♪
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
♪
అంతులేనీ ఇష్టమంతా గంగలా పొంగనీ ఆనకట్టే వేసుకోకూ వద్దనీ
కలపాలనుంటే చేతినీ ఎగరాలనుంటే మనసునీ
దాచేయయకూ ఆపేయకూ అటు వైపు సాగే అడుగునీ
ఒక లాలన ఒక దీవెన సడి చేయవా యెద మాటున
తియతీయని ప్రియభావన చిగురించదా పొరపాటున
కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో
పెనవేసుకున్న ప్రేమలు మెలమెల్లగా ఎటుపోయెనో
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri