చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే (అయితే, అయితే)
తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే (ఇట్టే, ఇట్టే)
అడ్డు చెప్పదే umbrella ఎపుడు
ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగ మనకొక ఆలీబాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే అల్లావుద్దీన్ జీనీ ఉంటే
చూపదా మరి ఆ మాయాదీపం
మన fate-ey flightఅయ్యే runway
♪
నడిరాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఊరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మోనాలిసా మొహమ్మీదే నిలుస్తావా
ఓ చిరునవ్వా ఇలా రావా
♪
వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగేనా ప్రతి రోజు
ఎలాగైనా ఏదో రోజు మనదై రాదా
చిటపట చినుకులు అరచేతులలో ముత్యాలైతే అయితే (అయితే, అయితే)
తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే (ఇట్టే, ఇట్టే)
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri