రా సిలకా సిరులే ఒలక సిగురాకుల సిగ్గెనకా గోరొంక ఎదలో ఇంకా మొలిసిందొక నెలవంక కిలకిల నవ్వుల రాక ఇటు గూటిని చేరాకా కలకల పువ్వుల కోక సవరించెనే వేడుక తొలి ఎన్నెల కన్నులు తెరిచాక ఈ వాకిట వన్నెలు పరిచాక ఒక వరసన ప్రేమలు విరిసేనంటా తళతళ మిలమిల తారల్లాగా రా సిలకా సిరులే ఒలక సిగురాకుల సిగ్గెనకా గోరొంక ఎదలో ఇంకా మొలిసిందొక నెలవంక తానూ ఊఊ ఊఊ నేననే పదములే మారాయిచోట పాటగా నిన్నటి రాతిరి నిదురలోకన్న రంగుల కలలతోపాటు వెచ్చటి ఊపిరి తేలుతూ ఉంది ఊహల రెక్కల చాటు అటువైపున్నా ఇటువైపున్నా విడిపోలేని ఓ నీడలా అడుగేస్తూ ఉంటే జాడలా ఆ పంచప్రాణంలా పదపద పదపద నడిపించంగా సేనూ ఊఊ ఊ సెరువులా ముడి పడి ఉంది ఈ బంధం చక్కగా చల్లటి గాలులు మోసుకొస్తుంటే అల్లరి ముచ్చట బాగా మెల్లగ ఊయల ఊగుతు ఎంత అల్లుకుపోయెను తీగ ఆ మొన్నల్లా ఈ నిన్నల్లా కరిగే కాలం ఓ వెన్నెలా చెయ్ చాచింది ఈ మన్నులా ఆ మిన్ను అందేలా గలగల జలజల చినుకుల్లాగా