Chakri - Adigi Adagaleka şarkı sözleri
Sanatçı:
Chakri
albüm: Devadasu
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా
యెన్ని జన్మలైన జంట వీడరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
నీకన్నా మెత్తనిది నీ మనసే నచ్చినదీ
నీకన్నా వెచ్చనిది నీ శ్వాసే నచ్చినదీ
పెదవికన్న యెద తియ్యనిదీ
కనులకన్న కల అల్లనిదీ
నవ్వుకన్న సిగ్గే నాన్యమైనదీ
జన్మకన్న ప్రేమే నమ్మికైనదీ
యెన్ని జన్మలైన ప్రేమ మాయరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
నీకన్నా చల్లనిది నీ నీడే దొరికిందీ
నీకన్నా నిజమైంది నీ తోడే నాకుంది
సొగసుకన్న వొడి వాడనిదీ
బిగుసుకున్న ముడి వీడనిదీ
ముల్లులేని పువ్వే ప్రేమ అయినదీ
పూలులేని పూజే ప్రేమ అన్నదీ
యే జన్మలోన ప్రేమపూజ మానరాదనీ
అడిగీ అడగలేక ఒక మాటే అడగనా
తెలిపీ తెలుపలేక ఒక మాటే తెలుపనా
ఆశగా అడగనా నీ అడుగునై అడగనా
మౌనమై తెలుపనా నీ దానినై తెలుపనా
బాస చేసుకున్న మాట మార్చరాదనీ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri