మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
♪
మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
తనవారే వస్తుంటే అలుపింక మరిచాడే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే
పడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే
♪
మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
♪
గల గల మాటల సడిలో బరువిక తేలికపడెలే
ఇరుకుగా మారితే గదులే, చురుకుగా ప్రాణమే కదిలే
మనమంతా కలిసుంటే కలతున్నా మరిచేనే
మనమంతా వెనకుంటే మరణాన్నే గెలిచేనే
♪
మిము కలవగా తెగ కలవరం
అసలిది కదా ఒక సంబరం
ఒక వరసలా కదిలిన క్షణం
ఇక తెలియదే ఒంటరితనం
ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
ఇల్లంతా మారింది సందళ్ళుగా
వీరంతా ఉండాలి వందేళ్ళిలా
మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే
మనసంతా వెలుగేనా
ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే
పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే
పడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri