సుక్కలే నవ్వినట్టు సక్కగున్నావే మబ్బులే పెంచినట్టు ముద్దుగున్నావే మట్టిలో మాణిక్యమై నాకు సిక్కావే గుండెల్లో గూడు కట్టి దాసుకుంటానే ♪ సుక్కలే నవ్వినట్టు సక్కగున్నావే మబ్బులే పెంచినట్టు ముద్దుగున్నావే మట్టిలో మాణిక్యమై నాకు సిక్కావే గుండెల్లో గూడు కట్టి దాసుకుంటానే అమ్మలా నీకు లాల పొయ్యనా నానలా మోస్తూ ఊరేగించనా మామ అన్న పిలుపే నాకు చాలుగా జన్మఅంతా నీకే సేవ చెయ్యనా సుక్కలే నవ్వినట్టు సక్కగున్నావే మబ్బులే పెంచినట్టు ముద్దుగున్నావే ♪ బందాలు లేనేలేని ఏకాకినేనే ఆ బాద గుర్తేరాని వరమై వచ్చావే ఏ దారి తెన్ను లేని గాలిపటాన్నే ఆదారమై నువ్వు ఎగరేస్తున్నావే నువ్వు పలికే మాటల్లో తేనెల జల్లే కురిసేనే నువ్వు నడిచే వేళల్లో దారులు అన్నీ మురిసేనే కడదాకా నీ తోడుంటా నిన్ను మించి ఏదీ లేనేలేదంట బతుకే నీ బతుకే నీ కొరకే ♪ ఎంత నువ్వు చదివినా చదివిస్తానమ్మా నేను నిచ్చెనై శిఖరం ఎక్కిస్తానమ్మా నీ చిన్ని నవ్వుచూస్తే అంతేచాలమ్మా కష్టమెంతదైనకానీ మరిచేస్తానమ్మా రంగుల రాట్నం ఎక్కి నువ్వు అల్లరి చెయ్యవే గుర్రపు స్వారి చేస్తూ మరి గోల చేసెయ్వవే పానీ పూరీ పిజ్జా బర్గర్ లాగించెయ్యవే 3 D వింతల విన్యాసాల cinema చూడవే జీవితం ఒక సరదాల తీరం చూపనా ఇలా ఈ సంబరం జీవితం ఒక సరదాల తీరం చూపనా ఇలా ఈ సంబరం సుక్కలే నవ్వినట్టు సక్కగున్నావే మబ్బులే పంచినట్టు ముద్దుగున్నావే మట్టిలో మాణిక్యమై నాకు సిక్కావే గుండెల్లో గూడు కట్టి దాసుకుంటానే అమ్మలా నీకు లాల పొయ్యనా నానలా మోస్తూ ఊరేగించనా మామ అన్న పిలుపే నాకు చాలుగా జన్మఅంతా నీకే సేవ చెయ్యనా తందానే నానే నానే తానే తానానే తందానే నానే నానే తానే తానానే