Kishore Kumar Hits

Sagar - Pakka Local (From "Janatha Garage") şarkı sözleri

Sanatçı: Sagar

albüm: Geetha Madhuri Telugu Superhit

హలో హలో మైకు టెస్టింగ్ సభకు నమస్కారం
నా సొంతపేరు బంగారం ఒంటితీరు తగరం
పుట్టిందేమో యానాము కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చీకారం
నేలబారు లెక్కుంటది నా యవ్వారం
ఇంగిలీషులోన దణ్ణమెట్టనెప్పూడూ
తేటతెలుగులో మీకు వందనం
ఫేసుక్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడూ
నాకు ఇష్టమంట పసుపు చందనం
సెల్లు నంబరే లేదు నాకు అస్సలే
డోరు నంబరే మీకు ఇస్తలే
సెంటుబాటిలే ముట్టనైన ముట్టలే
సన్నజాజులంటే సెడ్డమోజులే
ఏ స్టారు హోటలు బొట్టుపెట్టి పిలిచినా
దబాదబాదాబాకే పరుగుతీస్తలే
డిస్కోలు పబ్బులూ డిమ్ము లైటు కొట్టినా
మావితోపులోనె మేళమెడతలే...
ఎందుకు? ఎందుకంటే!
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
హే వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే
లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో
నే ఉన్నూరు గీతదాటనే
సరుకు తోటల్లో సైకిలేసుకో
పిల్లా నీ బాడీ బల్లే బల్లే మెరిసిపోతదే
ఇందా డైమండు నెక్కిలేసు తీస్కో
వజ్రానికి నా ఒంటికి వరస కుదరదే
తెచ్చి తిర్ణాల పూసలదండేస్కో
నువ్వు శానా సింపులే
ఇదేముంది శాంపులే
పాషుగుంటలేదు నా సిస్టమూ
ఎందుకేంటి? ఎందుకంటే!
నేను పక్కా లోకల్ పక్కాలోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కాలోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
హే ప్లాస్మానా? బ్లాక్ అండ్ వైటా?
టీవీ ఏదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే
మర్పీ రేడియోని గిప్టు ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరిష్టం ఎంచుకో
షర్టు నలగందే ఎట్టా ఏముంటది కిక్కు
రెంచీ స్పానరుకే నా ఓటు రాసుకో
టచ్చేశావమ్మడూ
నేనింతే పిల్లడూ
నచ్చిసావదంట క్లాసు ఐటమూ
ఎందుకే? ఎందుకేంటేహే
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు
నేను పక్కా లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకలూ
నేను వాడే గాజుల్ కోకారైకల్ అన్నీ ఊరమాసు లెక్కలు

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar