రావోయి చందమామ మా ప్రేమ గాధ వినుమా రావోయి చందమామ రావోయి చందమామ ఈ భామ తీరు కనుమా రావోయి చందమామ ♪ తాళే కట్టని తనతో వేలుపట్టి వచ్చానోయ్ ఏడడుగులు దాటేసా ఏంచేస్తాడో ఏమో రావోయి చందమామ మనసే బంగరు తాళి తనకే ముడి వేసానోయ్ ఏడు జన్మల దాకా జతగా నడిచే వాడ్నోయ్ రావోయి చందమామ ఈ భామ తీరు కనుమా రావోయి చందమామ ♪ అందరినీ వదిలేసి ఇతనితో ఉంటున్నానోయ్ ఏ తీరుగ చుసేనోయ్ నీవొక కంటను కనువోయ్ రావోయి చందమామ శివుడు బ్రహ్మల వోలే తలా నాలుకలలొ కాదోయ్ ఆ విష్ణువు వలెనె నేను యదలో దాచితి చూడోయ్ హే రావోయి చందమా... చందమామ ♪ చిననాటి చెలికాడే ఐనా ఎదో తేడా సూటిగా చూడాలంటే తెలియని సిగ్గొస్తుందోయ్ రావోయి చందమామ పరికిణి వేసిన తానే పైటల దాకెదిగిందోయ్ తేడా తనువులలోనే హృదయాలల్లో కాదోయ్ రావోయి చందమామ (చందమామ) మా ప్రేమ గాధ వినుమా రావోయి చందమామ