కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ వొళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిల
'కూ' అంటే 'కూ' అంటూ
నాతో ఉండాలా
నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుగాల
అమ్మ నీ అడుగుల్లో అడుగేయలా
కొమ్మ ఉయ్యాలా కోన జంపాల
అమ్మ వొళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిల
'కూ' అంటే 'కూ' అంటూ
నాతో ఉండాలా
నాతో ఉండాలా
♪
గోరింట బెట్టాలె గొరవంక దాయె
నెమలీకాలెట్టాలి నెలవంక దాయె
నెలవంక దాయె
♪
కూరంట బువ్వంటా ఆటాడుకోవాలి
దారెంట బోతున్న కుందేలు దాయె, దాయమ్మ దాయె
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ వొళ్ళో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
♪
కొప్పూనా పూలెడతా కోతిపిల్ల దాయె
తూగుటుయ్యల కడతా తూనీగ దాయె
తూనీగ దాయె
ఈపూన కూసోని సెరువంతా తిరుగాలే
ఈతాలు నేర్సిన తాబేలు దాయీ
దాయమ్మ దాయీ
కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా
అమ్మ వొల్లో నేను రోజూ ఊగాలా
రోజూ ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిల
'కూ' అంటే 'కూ' అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri