Kishore Kumar Hits

Ilaiyaraaja - Virisenule şarkı sözleri

Sanatçı: Ilaiyaraaja

albüm: Vidudhala (Original Motion Picture Soundtrack)


విరిసెనులే కొండమల్లి
వేరెవరూ చూడనిది
అడవే నాకై పూచెనుగా
అది మా ఇంటికి వస్తుందా
కోనే పరిమళమాయనుగా
నాతో కలిసెను స్నేహముగా

విరిసెనులే కొండమల్లి

విరిసెనులే కొండమల్లి
కన్నులకే కనబడదే
పూసిందెపుడో తెలియదులే
వేచే ఉంటాలే విసుగేలే
పువ్వున తానే కొత్తదమ్మా
నా మనసెపుడూ మెత్తనమ్మా
విరిసెనులే కొండమల్లి

కల నాకే రాదు కదా
ఇది నిజమే, కాదు కల
కలగా మారదు జీవితమే
జీవితమంటే బతకడమే
మంచు మేఘమై మనసులలే
కలలే అలలా కదలినవే
మునిగెను నిద్రలో ఈ మనసు
నిదురే లేపడమది తెలుసు
మేని పొర నాకెరిగే ఇలా
కాటును వేసే తుమ్మెదలా
విరిసెనులే కొండమల్లి
కన్నులకే కనబడదే
కోనే పరిమళమాయనుగా
నాతో కలిసెను స్నేహముగా

వద్దకొచ్చే వేళల్లోన
అడ్డు చెప్పే దూరమేలా
గుండె నిండా గువ్వపిల్ల
నిన్ను వీడిపోను మల్లా
జగమున ఏడకు పోయిననూ
ఇద్దరముంటాం పాటలులా
నిలవక ఉసురే ఊగినను
నిజమే ఎవరికి తెలియదులే
సాక్షితమే కదా కారడవి
కోనలు వీచే గాలులివి
విరిసెనులే కొండమల్లి
కన్నులకే కనబడదే
అడవే నాకై పూచెనుగా
అది మా ఇంటికి వస్తుందా
పువ్వున తానే కొత్తదమ్మా
నా మనసెపుడూ మెత్తనమ్మా
విరిసెనులే కొండమల్లి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar