ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే
కళ్ళల్లో బాసలన్నీ రాగాలై సాగెనే
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
♪
జాబిలి ఆ నింగిలోన
మబ్బులలో దాగేనో వెన్నెలలే దాచేనో
తియ్యని నీ ధ్యాసలోనే
నిలిచేనే నా ధ్యానం నీతోనే నా లోకం
కనికరించి నన్నే సేదతీర్చు వేళ
కళ్ళలోన ప్రేమ చిలకరించు వేళ
కరిగేనే నీలో
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
♪
జీవితం పండేను నేడు
పలికెనులే ఓ గీతం పాడెనులే సంగీతం
తోడుగా నీవున్ననాడు ఆశలకే శ్రీకారం
మమతలకే ప్రాకారం
చల్లగాలి నీవై సద్దు చేసినావే
చందమామ నీవై పలకరించినావే
వెలిసేనే నీకై
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
గుండెల్లో ఊసులన్నీ కళ్ళల్లో పొంగెనే
కళ్ళల్లో బాసలన్నీ రాగాలై సాగెనే
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
ముద్దబంతి పూచేనులే
తేనెజల్లు చిందేనులే
ఊహలన్నీ ఊరేగెనే
నందనాలు విందు చేసెనే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri