సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా
మధురాల మధువులు చిందే చల్లని ప్రేమే మాయమా
అ. రేపవలు నిద్దురలోన ఎద నీ తోడే కోరును
యుద్దాన ఏమైనా నా ఆత్మే నిన్నే చేరును
ఎద తెలుపు ఈ వేళ ఏల ఈ శోధన.
జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన
నాలో ప్రేమే మరిచావో
ప్రేమే నన్నే గెలిచేనే
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
పూవులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే
ఊహలే పూలై పూచు నీ ఎద మాటున చేరితే
మాసాలు వారాలవును నీవు, నేను కుడితే
వారాలు మాసాలవును బాటే మారి సాగితే
పొంగునీ బంధాలే నీ దరి చేరితే
గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే
నీవే కదా నా ప్రాణం
నీవే కదా నా లోకం
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
గుండెలో నిండమంటా నీడగా పాడమంట నా సిరి నీవేనట
సుందరి నేనే నువ్వంట చూడని నీలో నన్నంట
కానుకే ఇచ్చా మనసంట జన్మకే తోడై నేనుంట
సాహిత్యం: వేటూరి
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri