నన్నా నననే ఆఁ
నన్నా నననే ఆఁ
నన్నా ఆఁ హుఁ నా
హే బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని
కన్నె సొగసే దుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు
జంటను వెతికే వేళ ఇది
తొందర తొందర పడకోయ్ అల్లరి అల్లరి మొగడా రెక్కలు విప్పిన రాతిరిది
హోయ్ పైన చూస్తే తళుకుల తార కింద చూస్తే వెన్నెల ధార
హా పక్కనుందోయ్ ముద్దుల డేరా సక్కగొచ్చి హత్తుకుపోరా
పడుచు ఒడినే పంచుకుపోరా
ఓయ్ భామవి నువ్వు బావను నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
హే కత్తెర చూపులు కొడితే సిగ్గులు వాకిట తడితే ఉక్కిరిబిక్కిరి అయిపోనా
తత్తర తత్తర పడితే ఠక్కున కౌగిలి విడితే టక్కరి పిల్ల రెచ్చిపోనా
హో గువ్వ గుట్టు గోరింకకెరుక పిల్ల బెట్టు పిల్లాడికెరుక
ఒప్పుకుంటే వయ్యారికూన కురిసిపోదా ముత్యాలవాన
జంట తాళం చూడవే జాణ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని
కొత్తకోక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెత్తిపోని
కన్నె సొగసే దుమ్మెత్తిపోని
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
హాఁ నిద్దర కరువవనీ
అహా హా ఇద్దరమొకటవనీ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri