Amani - Pill Adaraho şarkı sözleri
Sanatçı:
Amani
albüm: Amma Donga
పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
అరె పిల్ల అదరహో పిచ్చి ముదర హో
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మురిపాలే పొంగిస్తాది సగ పాలే అందిస్తాది
కన్నె కజరహో... కన్ను చదర హో...
హా కన్నె కజరహో కన్ను చదర హో
అమ్మ దొంగ చల్లకొచ్చి ముంతదోచి
బుజ్జగించి బుగ్గ పండు గాటు పెట్టి
మరుమల్లె చెండిస్తాడు మగడల్లే చెయ్యెస్తాడు
అరె పిల్ల అదరహో...
హా కన్ను చదర హో...
ఆహా...
నచ్చిందే మెచ్చానే మెచ్చిందంతా గిచ్చానే
అచ్చాగ ఉన్నావే బచ్చా బంతి మొగమ్మ
వచ్చిందే వయ్యారం వాటేస్తావ ఈ వారం
హా చేస్తావా సంసారం చేమంతుల్లో పై వారం
ఎగుడు దిగుడు సొగసు
అది మొగుడు అడుగు వయసు
తళుకు బెళుకు తడిమే
తాలాంగుది తాళం ఇవాళ
కన్నె కజరహో... కన్ను చదర హో...
అరెరరె అబ్బదీని సోకుమాడ
ఉబ్బలూరు నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు మగడల్లే గిల్లేస్తాడు
హా హొ హా హా...
గుత్తంగా గుచ్చెక్కి గుంతల్ బంజాయిస్తాలే
మెత్తంగా మత్తెట్టి మెహదీ పట్నం వస్తాలే
కళ్ళల్లో నీ రోషం అబ్బ కవ్వించింది ఈ మాసం
అరె తీస్తాలే నీకు సౌండ్ తీరుస్తావా ఉల్లాసం
గుబులు మనసు కబురు
అది మొగలి పొదల గుబురు
నలక నడుము వనికె
సుఖాలలో తుఫానివాలే...
పిల్ల అదరహో... పిచ్చి ముదర హో...
హా కన్నె కజరహో... కన్ను చదర హో...
అబ్బ దీని సోకు మాడ ఉబ్బలూరు
నిబ్బరాల డబ్బపండు కాపుకొచ్చి
మరుమల్లె చెండిస్తాడు మగడల్లే చెయ్యెస్తాడు
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri