చిత్రం: పోతేపోనీ...(2006) సంగీతం: మిక్కీ జే మేయర్ సాహిత్యం: కులశేఖర్ చెలి చెలియ చెలియ... నిన్న లేదిలా మొన్న లేదిలా కొత్తగా ఉంది వింత వేధన వేల ఆశలే పూలు పూచనే ఈ వేళా లోలోనా ఎందుకో ఇలా గుండెలోపల ఎన్నడూ లేదు ఇంత యాతన గాలి తాకినా ఆకు రాలిన హైరానా నాలోనా ఇదివరకెరుగని వయసుకు తెలియని మనసున పలికెను తొలి తొలి సరిగమ పరిచయమెరుగని మధువులు చిలికెను వరసలు కలిపెను పరువపు మధురిమ తలపుల వరమా తపనల వనమా అడగని వరమా మాధనుడి మహిమా తొలి అనుభవమా తెలియని సుఖమా ఎదలో ఎగసే లయలే వినుమా నీలి మేఘమా జాలి చూపుమా వింత వేధనల వివరము తెలుసా ఇంద్రజాలమా ఇంత మొహమా ఎందుకోసమని అడగవె మనసా వాన విల్లులా మెరిసే సొగసా తేనే జల్లును కురిసే వరసా ఆమె మాటలకు మనసు ఎగసిపడి పొంగిపోయినది తెలుసా వయసా ఇది నిజామా కలవరమా చిలిపిగా చెలి పలికే ప్రియ స్వరమా అతిశయమా పరవశమా మాట రాని మధి మధువనమా నాలో... చెలి పలుకే తొలి చినుకై పెనుమరుగై పరుగులు తీసేను సాగే శృతి లయలే కోటి భావాలు రేపెను నా మదిలో విడిపోలేని కౌగిళ్ళలో... వివరము తెలియక క్షణమొక యుగముగా అడుగులు కదలక వయసుకి తికమక జిలిబిలి పలుకుల చిరు చిరు నగవుల గల గల వలపని మనసుకి తెలియక నింగిని అడిగా నేలని అడిగా వెన్నెలనడిగా వేకువనడిగా చినుకులనడిగా చిలకలనడిగా అలనే అడిగా కథనే అడిగా ఏమి చేసిన ఆమె ఊసులే ఎందుకో మరి మనసున ఎగసే ఏది చూసిన ఆమె రూపమే కంటి పాపలలో ఎదురుగ నిలిచే ఆమె చూపులే బతికే కలలే తీపి తీపి తడి సెగలే రగిలే ఆమె తాకగనే బతుకు మురిసిపడి వేల ఆశలను ఎదలో పలికే నిద్దురలో మెళకువలో కనులకు జత కలిసే ప్రతి కలలో ఎధ లయంలో అడుగులలో అందమైన ప్రతి అలజడిలో నాలో... చెరి సగమై తనువొకటై తపనలతో పదములు పాడెను ఆమె తొలి చినుకై ప్రేమ బంధాలు వేసెను నా ఎదకి అనురాగలే ఈ జన్మకి...