గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం
భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కుతీగలాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్ని ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటు లేని వింత యుద్ధం
ఇది గుండెలోతు గాయమైన శబ్దం
నడిచొచ్చే నర్తన శౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి
హలాహలం భరించిన దగ్ధహృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం
దివినుంచి భువిపైకి భగభగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
శంఖంలో దాగేటి పొటేత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాచేసే ఆశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
తన మొదలే వదులుకొని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకొని ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడో మనసును దోచే మాధవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు
గగనపు వీధి వీడి వలస వెళ్ళిపోయిన నీలిమబ్బు కోసం
తరలింది తనకు తానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచునుంచి నేలజారిపోయిన నీటిచుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri