Kishore Kumar Hits

Prasanth - Nanu Preminchananu-Sad şarkı sözleri

Sanatçı: Prasanth

albüm: Jodi

నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదే నా హృదయం ఓపదే నా హృదయం
సత్యమ సత్యము పక్కపక్కనే ఉంటై పక్కపక్కనే చూపుకి రెండు ఒక్కటే
బొమ్మాబొరుసులు పక్కపక్కనే చూసే కళ్ళు ఒక్కటే అయినా రెండూ వేరేలే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
రేయిని మలిచీ అ అ అ ఓ
రేయిని మలిచి కనుపాపలుగా చేశావో కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో ఓ
మెరిసే చుక్కల్ని తెచ్చి వేలి గోళ్ళుగ మలిచి మెరుపుల తీగను తెచ్చి పాపిటగా మలిచావో
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి మంచి గంధాలెన్నో పూసి మేను మలిచావో
అయినా మగువా మనసుని శిలగా చేసినావే
వలచే మగువా మనసుని శిలగా చేసినావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా బ్రతికేస్తా
వయసుని తడిమి నిదుర లేపింది నీవేగా
నిదుర లేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ గాలి నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు వివరము తెలిపనదెవరు ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కనులే లేక మనసుని మాత్రం వీడిపోయావే
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
నను ప్రేమించాననుమాట కలనైనా చెప్పేయ్ నేస్తం కలకాలం బ్రతికేస్తా
పువ్వుల యదలో శబ్ధం మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓపదే నా హృదయం ఓపదే నా హృదయం

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar