విశ్వమే దాగినా నాలోన
ఎప్పుడూ ఒంటరే నేనేనా
చూపులే గుచ్చినా అడగనైనా లేనా
చేతులే వేసినా ఆపనైనా లేనా
కాలమే చేసిన మానని గాయం
యంత్రమే చూపదా నా గమ్యం
అందనే అందదే ఒక్క అవకాశం
అందితే చేరనా నేను ఆకాశం
అందరూ తప్పని చూపినా వేలే
ఊహకే అందని ప్రేమ నాదేలే
ఇంతగా ఎగిరినా తాకుతోందీ నేలే
మత్తులో మరవనా మునుగుతున్నా తేలే
నా చిన్నీ గుండెలో
ఏదో వేదన మొదలయ్యేనా
నా అన్ని ఆశలే
గాయం మాటున మిగిలేనా
మనసిలా అద్దమై ముక్కలయ్యేనా
ఒక్కరే వందలా చుట్టు మూగేనా
కరగనూ కలవనూ
ద్వేషమే వదలనూ
గతమునే విడువనూ
మరణమే మరువనూ
శత్రువై దేహమే
మనసుతో కలబడే
చీకటే వీడెనే
బ్రతుకుకే సెలవనే
కదిలెనే
నేటితో బాధలే తీరేనా
నాదనే లోకమే చేరానా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri