రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మోహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్నుగీటగా కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మోహం నదిలో అలలా
♪
చెక్కిళ్ళలో ముద్దు చమ్మ తడి ఆరకున్నది
నీ కళ్ళలో నీలి బొమ్మ కదలాడిందే
తెలిపింది కన్నె గళమే మనువాడలేదని
ఓ పువ్వు పూసింది ఒడిలో తొలి ప్రేమల్లే
మెలకువే స్వప్నమై మెలితిరిగెను నాలో
ఒరిగినా ఒదిగినా హత్తుకొనే ప్రేమ
నీ పిలుపే పిలిచే వలపై
పెదవుల్లో దాగి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మోహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్నుగీటగా కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్న దొక మొహం నదిలో అలలా
♪
తారాడు తలపులెన్నో నీలాల కురులలో
తనువు మరచిపోయే మరులే పొంగే
ముద్దాడ సాగె పెదవి ఒక మూగ భావమే
చాటు కవితలన్నీ అనురాగాలే
పెదవులే విచ్చిన మల్లెపూల వాసన
సొగసులే సోకిన వయసుకే దీవెన
వీరెవరో జత కోకిలలో ఎద లేడై లేచి
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మోహం నదిలో అలలా
కనులే ముద్దులాడగా
కలలే కన్నుగీటగా కసిగా
రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా
రేపుతున్నదొక మొహం నదిలో అలలా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri