నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం
గాలి వాటు గమనానికి కాలి బాట దేనికి గొర్రెదాటు మందకి మీ జ్ణానబోధ దేనికి యే చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం యే క్షణాన మార్చుకుంది జిత్తుల మార్గం రామబాణమార్పిందా రావణ కాష్ఠం కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం పాత రాతి గుహలు పాల రాతి గృహాలయినా అడవి నీతి మారిందా ఎన్ని యుగాలయినా వేట అదే వేటు అదే నాటి కధే అంతా నట్టడవులు నడివీధికి నడిచొస్తే వింతా బలవంతులె బ్రతకాలని సూక్తి మరవకుండా శతాబ్ధాలు చదవలేదా ఈ అరణ్యకాండ నిగ్గ దీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని మారదు లోకం మారదు కాలం దేవుడు దిగి రాని యెవ్వరు యేమై పోని మారదు లోకం మారదు కాలం