సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికసమెందుకని
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరత పతాకం
ఆవేశంలో ప్రతినిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతి కపోతం
బంగరు భవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరత పతాకం
చెరుగుతుంది ఆ తల్లి చరితలో విశ్వ విజయాల విభవం
సురాజ్యమనలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికసమెందుకని
కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచు శిఖరం
కలహముల హాల హాలానికి మరుగుతున్నది హిందుసంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషం చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri