Kishore Kumar Hits

Pavan Kalyan - Prema O Prema şarkı sözleri

Sanatçı: Pavan Kalyan

albüm: Gokulamlo Seetha


ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమైపోకమ్మా
వలపుల వనమా
వెలుగుల వరమా
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

ఎంత మధనమో జరగకుండ ఆ పాల కడలి కదిలిందా
అమృతకలశమందిందా
ఎన్ని ఉరుములో విసరకుండ ఆ నీలినింగి కరిగిందా
నేలగొంతు తడిపిందా
ప్రతి క్షణం హృదయం అడగనిదే చలువనీయవ ప్రేమా
ప్రకృతిలో ప్రళయం రేగనిదే చిగురుతొడగవ ప్రేమా
అణువణువూ సమిధలాయే ఈ యాగం శాంతిచేదెపుడమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా

ఆయువంతా అనురాగ దేవతకి హారతీయదలిచాడు
ఆరిపోతు ఉన్నాడు
మాయమైన మమకారమేది అని గాలినడుగుతున్నాడు
జాలి పడవ ఈనాడు
నిలువునా రగిలే వేదనలో విలయజ్వాలలు చూడు
ప్రణయమే గెలిచే మధురిమతో చెలిమిజోలలు పాడు
నీవంటూ లేకుంటే ఈ స్థితిలో ఏమౌతాడోనమ్మా
ప్రేమా ప్రేమా ఓ ప్రేమా పిలుపును వినవమ్మా
ప్రాణం పోసే అమృతమా విషమై పోకమ్మా
వలపుల వనమా
వెలుగుల వరమా
ఈ ఎదలో కొలువుందువు రావమ్మా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar