Kishore Kumar Hits

Leon James - Amma Amma Neevennela şarkı sözleri

Sanatçı: Leon James

albüm: Paagal


కనుపాప నువ్వై వెలుగిస్తూ
నా కలకు రంగుల మెరుపిస్తూ
అడుగడుగు నీడై నడిపిస్తూ
ప్రతి మలుపులో నను గెలిపిస్తూ
అండగా ఉండవే ఎప్పుడూ నువ్విలా
పండుగై నిండవే లోపలా వెలుపలా
నువ్వు నా తోడై లేనిదే నేనెలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా

అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
తల నిమురు చేయి చాలు
తనువంత హాయి స్వరాలు
లాలన స్వాంతన అన్ని నీవే
ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు
దీవెనై నడపగా నిండు నూరేళ్లు
నా మొదటి నేస్తమా
నీ తీపి గురుతులు వేలు
రేపనే రోజుకు దారి దీపాలు
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మా అమ్మా నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
లోకాన అమ్మలంత అందించు ప్రేమనంతా
ఒక్క నువ్వే వరముగా పంచినావు
చిన్నదే ఆకాశం అనిపించు మమతవు నీవు
నన్నిలా పెంచగా ఎంచుకున్నావు
ఎన్ని మరుజన్మలు నాకెదురుపడినా గానీ
నీ ఒడి పాపగా నన్నుండనీమ్మా
అమ్మ అమ్మ నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
అమ్మ అమ్మ నీ వెన్నెల
నిత్యం నాపై ఉండాలిలా
ఆ... అమ్మా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar