Leon James - Aagave Nuvvagave şarkı sözleri
Sanatçı:
Leon James
albüm: Paagal
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే
మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే
నీ కొరకే వెతుకుతున్నా
వదిలెలుతూ పరిగెడితే
తెగిపోయే బంధమేనా
తెగిపోయే బంధమేనా
తెగిపోయే బంధమేనా
అమ్మల్లే నుదురే తాకేటి చేయే
మార్చేసి రాతే వేదించెనే నన్నే
ఎడారంటి ఎదకే ప్రాణాలు పొసే
ప్రేమించమంటే గుండే కోశావులే
ముగుస్తుంటే కధలన్నీ దాచాను బాధనే
రెప్పల్లో నిలిపానే కన్నీటినే
నాపైన చూపించావు ఎనలేని ప్రేమనే
విరహాల నదిలో విసిరేయకే హే
నా వెనకనే నడిచావే
నా బ్రతుకును నడిపావే
నా కలలను విడిచావే
నేనుందే నీ కొరకే
ఆ నింగిని చూపావే
ఎగరడమే నేర్పావే
రెక్కలనే విరిచావే
మన చెలిమే మరిచి
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే
మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే
నీ కొరకే వెతుకుతున్నా
వదిలెలుతూ పరిగెడితే తెగిపోయే బంధమేనా
♪
అద్దంలా ఎదురై చూపావు నన్నే
వద్దంటు రాయే విసిరావులే నాపై
నువ్వేకాక ఎవరూ నాకంటూ లేరే
నీ ధ్యాసలోనే నన్నే ముంచావులే
నువు లేని క్షణమే నాకింక శూన్యమే
నా వెంట లేనే లేదు సంతోషమే
భరించానే ఇన్నాళ్లు తెలిసినా మోసమే
నాకన్నా నిన్నే బాగా నమ్మానులే హేయ్
ఓ నిజముని చెప్పేవా
నన్నొదిలితే నువ్వైనా
ఏ సుఖముగ ఉంటావా
నీవల్లే కాదసలే
ఈ నడుమున దూరాలే
చెరిపొకటిగ చేరాలే
మన మునుపటి కాలాలే తే
అడుగే కదిపే
చెరగని నీ నవ్వులనే
అణువణువు నింపుకున్నా
ప్రతినిమిషం గురుతులనే
మరువకనే బ్రతుకుతున్నా
కనులసలే నిదురొదిలే
నీ కొరకే వెతుకుతున్నా
వదిలెలుతూ పరిగెడితే
తెగిపోయే బంధమేనా
♪
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
ఆగవే నువ్వాగవే
పోయే ఊపిరే నువ్వాపవే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri