Kishore Kumar Hits

Aditi Rao Hydari - Kanulalo Thadigaa şarkı sözleri

Sanatçı: Aditi Rao Hydari

albüm: Sammohanam


కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా, కరిగే కథగా
నువు లేనిదే, ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా

కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా, కరిగే కథగా

ఏది ఆ క్షణం, ఏది ఆ గతం
నా మది వెతుకుతున్నది
ఏ దరి తోచక నిలిచిన జీవితం
బరువై బ్రతుకుతున్నది
అనలేని మనసేమో లోలోపల
ఆవేదనౌతున్న వేళ
నా నిజం తెలిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా, కరిగే కథగా

కలిసేదెందుకు? విడిపోయేందుకా?
తెలిసీతెలియకున్నది
ఎడబాటన్నది ఎవరికి వేడుక
మనసే అడుగుతున్నది
అలలాగ గగనాలకెగిరే కల
విరిగింది విలయాలు తాకి
గాయమై గడిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా, కరిగే కథగా

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar