Dennis Norton - Avunanna Kaadanna şarkı sözleri
Sanatçı:
Dennis Norton
albüm: Maya Lo
తెలిసిందే తెలియందై
కథే మారేపోయెనే
మనకింకా మిగిలింది
ఎటూ కాని యాతనే
ఔనన్నా కాదన్నా కాలం సాగేపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే
♪
గుండెలోన దాగున్న మాటలన్నీ
నేరుగానే నిలదీసాయే
ఓ ఓ, నిన్న మొన్న మామూలు నేను కానే
మారిపోయి వేరయ్యానే
నాపైనా ఇన్నాళ్ళు ఉన్నా
ఆ మేఘాలే తొలిగాయంటా
ఆకాశం రంగంత జారే
అద్దాలేవో పట్టిందటా
అవునన్నా కాదన్నా కాలం సాగేపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఔనన్నా కాదన్నా కాలం సాగేపోయే
నడిచిన దూరాలే గమ్యం లేనివాయే
ఇప్పుడేమో లోలోన ప్రశ్న ఊరుకోదే
నాకే నేనే లేనే
ఏదో ఏదో ఏమయ్యిందో
నాలోపలేదో ఓ కొత్త తీరే
పంతాలే పోయి పందాలే మాని
నా ఇంకో నేనే నన్నే చూసేనే
సరిపోతాయే గత గమ్యాలవే
తగు పాఠాలే మరుపే రావులే
ఇకపైన హాయిలే
తెలిసిందే తెలిసిందే
కథే నాది ఔనని
ఇకపైనా మనలేనే పరాయైన పాత్రనై
ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే
ఔనన్నా కాదన్నా కాలం ఆగిపోదే
దూరంగా నిల్చున్నా రేపే నాదే నాదే
ఇప్పుడిలా లోలోన
చిన్న నవ్వు చేరే
చాలే ఇంతే చాలే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri