సిరిమల్లెమ్మా హా ఓ హా చిరునవ్వమ్మా హా ఓ మా పల్లెకు పేరంటము వస్తారా తెస్తారా మీ రాకతో ఏరువాక సిరిమల్లెమ్మా చిరునవ్వమ్మా ♪ మా ఇంటి పొదరింటి పూలు కోవెల్లో రామయ్య కోసం మా ఊరి మాగాణి చేలు పండేను పది మందికోసం కల్లంటే తెలియంది మా పల్లెమ్మా గోవంటే మాలక్ష్మి మా గోపెమ్మా కొమ్మల్లో కూసే ఓ ఓ కోయిలమ్మా మావిళ్లు పూసేటి మధుమాస రాగాలు మా నోట పండించవమ్మా సిరిమల్లెమ్మా హా చిరునవ్వమ్మా హొ ♪ బంతుల్లో చేమంతులల్లే కలిసేటి మనసుంది మాకు మబ్బుల్లో తారల్లే మెరిసే గుణమొక్కటే మాకు సోకు వరితోనే సిరులిచ్చే గోదావరి దిగి వచ్చే స్వర్గాలే మా ఊరికి ఏ జన్మకైనా ఈ నేలపైనా పువ్వల్లే పుట్టాలి దివ్వల్లే వెలగాలి ఆ పుణ్యమే చాలునమ్మా సిరిమల్లెమ్మా హా ఓ చిరునవ్వమ్మా హా ఓ మా పల్లెకు పేరంటము వస్తారా తెస్తారా మీ రాకతో ఏరువాక సిరిమల్లెమ్మా చిరునవ్వమ్మా