ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఎరుక గలిగిన పదము
కొరివి కొనిదెచ్చుకొని వనికితేమి ఫలము
దయ్యమోలే నిన్ను పట్టుకున్నది ధనము
యుగములు గడిసినా మారలేదు నీ గుణము
నాకెదురే లేదని నాకెదురే లేదని
నాకెదురే లేదని ఎగిసిపడే నీ మదం
భరియింపక పుడమి శపియించెను ఇది నిజం
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఏ' ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
దూరానగల సిరుల దారులను గాలించి
పడవాలిమానాల పయనించి అవి తుంచి
కొమ్మ కుంకుమపూల అడవి సుగంధాల
పాదులను చిదిమి నరికి పారించితివి మురికి
ఆ పాపమో మున్ను అంటుకునే విషకన్ను
ఆ పాపమో మున్ను అంటుకునే విషకన్ను
ఏమౌనో నీ కథ ఎందాకో ఈ వ్యథ
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఏ' ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
నేలయద చనుబాల దారలు ఈ నదుల
కీచకుడై నువ్వు కాటు వెయ్యలేదా
చెట్టుకింత జాగ పిట్టకింత గూడు
పురుగు బూసికి పుట్ట బొరియలుంటే చాలు
నరుడా నీవెమో వందల ఎకరాలే పొంది
చీమైనా రాకుండా గోడలు కట్టించినావు
ఏడడుగుల జాగ ఏడడుగుల జాగ చివరికి నీ గూడన్నా
బైరాగి బోధను పెడచెవిన పెడితివన్న
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఓ' ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
సలువారాతిమేడ కట్టుకుని మురిసితివి
కడుపేదలను ఎంచి మెట్లకాడ నిలిపితివి
రంగు తెగ మత కుల భేదాలనెంచితివి
ఇలలో ఉత్తముడనని తెగ విర్రవీగితివి
తొమ్మిదర్రల తొర్ర
తొమ్మిదర్రల తొర్ర, గాలి తుంగ బుర్ర
తొమ్మిదర్రల తొర్ర, గాలి తుంగ బుర్ర
కొరడక్రిమి వేటుకు ఒరిగెను నీ వెనుగర్ర
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఏ' ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
తేనెలొలికే పండ్లు ఆకుసాటుననుండు
వాడిగల్గిన ముండ్లు పైనే ఉరుముచునుండు
స్వాతిముత్యపు చమట వొల్లు ముత్యపు జల్లు
భరణి ఉరుములు డొల్లు కాపు కంకుల పొల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
ఆశలేని మనిషికి అడివే తన ఇల్లు
సిరిమరిగిన నీకేమో నెత్తికెక్కినాయి కళ్లు
వినకబోతివి గదరా వినకబోతివి గదరా
ఎరుక గలిగిన పదం
కొరివి కొనిదెచ్చుకొని వనికితేమి ఫలం
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఎగువ తిరుమల, దిగువ తిరుమల
నీలోనే కొలువుండే నిలకడతో నీవుండు
కనుపాపలో మక్కా అజ్మీరులున్నవి
జమాయతులెందుకు జపములు జాలు
ఘాటి ఎద్దువోలే మతిని గుంజి గట్టు 'ఓ
ఘాటి ఎద్దువోలే మతిని గుంజి గట్టు
కాసే పున్నమికాంతి నీలోపలనే బుట్టు
ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
ఏ' ఇనకబోతివి గదరా ఇనకబోతివి గదరా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri