నేనేనా నేనేనా నాలా నే ఉన్నానా నీతోనే ఉంటే తెలియదే నీదేనా నీదేనా ఈ మాయ నీదేనా ఇన్నాళ్ళు లేదా మనసిదే నిముషమైనా నిలువలేను నువ్వు లేక నేనే నిదురలోను వదిలిపోని నిన్ను చూస్తున్నా మాటలెన్నో మిగిలిపోయే ఎంత చెప్పేస్తున్నా ఎదురుగానే నిలుచునున్నా వెతుకుతున్నా (ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం) (నీతో సావాసం నను చేసేనా మాయం) (తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే) (దూరమంతా తీరిపోయే మనసు తనువు తాకితే) ఎదురు చూడని స్నేహమే ఎదురు వచ్చిన వేళలో ఎవరు చూడని వైపుకి వెతికి వచ్చిన తోడువో గుండెలో మాట చెప్పలేకున్నా ఆ మాయలో నేను ఉన్నా ఎంత చూస్తున్నా చాల లేదమ్మ నా కళ్ళలో దాగిపోవా ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా పడిన దాకా తెలియదే ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా మనసు లోలో నిలువదే నిదుర లేదు, కుదురు లేదు నిమిషమైనా నాకే కదలలేను, వదలలేను మాయ నీదేనా మాటలైనా రానే రావు పెదవి దాటి పైకే పక్కనున్నా వెతుకుతున్నా నేను నిన్నేనా (ప్రేమ ఆకాశం సరిపోయేనా దేహం) (నీతో సావాసం నను చేసేనా మాయం) (తారలన్నీ రాలిపోయే కన్నులై వెలిగే) (దూరమంతా తీరిపోయే మనసు తనువు తాకితే)