నిన్నే నిన్నే వలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కన్నుల కరిగిన యవ్వనమా ఒంటరి బ్రతుకే నీదమ్మా నిన్నటి కధలే వేరమ్మా
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
పువ్వా పువ్వా నీ ఒడిలో ఒదిగిన క్షణం ఎక్కడే కలిగిన సుఖం ఎక్కడే
అభిమానంతో తలవంచినా ప్రేమకి చోటెక్కడే నిలిచితి నేనిక్కడే
కళ్ళల్లోని ముళ్ళుంటే కనులకి నిదరెక్కడే
వలచినవారే వలదంటే మనిషికి మనసెందుకే
నిన్నటి వలపే నిజమని నమ్మాను నిజమే తెలిసి మూగబోయి ఉన్నాను
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే నిన్నటి బాధ తీర్చులే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
ప్రేమా ప్రేమా నా మనసే చెదిరిన మధువనమే వాడెను జీవితమే
విరహమనే విధి వలలో చిక్కిన పావురమే మరచితి యవ్వనమే
కలలొనైనా నిన్ను కలుస్తా ఆగనులే ప్రియతమా
లోకాలన్ని అడ్డుపడినా వీడను నిను నేస్తమా
చీకటి వెనుకే వెలుగులు రావా భాధేతొలిగే క్షణమగుపడదా
నిన్నే నిన్నే పిలచినది అనుక్షణం తలచినది
నిన్నే నిన్నే వలచినది మనసునే మరచినది
కళ్ళలోని ఆశా కరగదులే కౌగిలిలోనే చేర్చులే నిన్నటి బాధా తీర్చులే
నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే నిన్నే
సాహిత్యం: భువనచంద్ర
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri