చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
ఓ ఓ ఓ ఓ హో ఓహో ఓహో
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
చందురుని తాకినదినీవేగా అరె నీవేగా
వెన్నెలని దోచినది నీవేగా అరె నీవేగా
వయసు వాకిలిని తెరిచె వయ్యారం నీ కలల మందారం శ్రుతిలయల శృంగారం
పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే
పూవులాంటి చెలి ఒడిలో పుట్టుకొచ్చె సరిగమలే
పైటచాటు పున్నమిలా పొంగే మధురిమలే
తలపుల వెల్లువలో తలగడ అదుముకున్నా
తనువుని పొదువుకొని ప్రియునే కలుసుకున్నా
తాపాల పందిరిలో దీపమల్లె వెలుగుతున్నా
మగసిరి పిలుపులతో తేనెలాగ మారుతున్నా
కోరికల కోవెలలో కర్పూరమౌతున్నా
చందురుని
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా అరె ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
రమ్మనే పిలుపువిని రేగుతోంది యవ్వనమే
ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే
నీటిలోని చేపపిల్ల నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియసఖుడు కౌగిలికి భారమౌనా
చెంతచేర వచ్చినానే చేయిజారిపోకే పిల్లా
పిల్లగాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల
అలిగిన మగతనమే పగబడితే వీడదే
చందురుని
చందురుని తాకినది ఆర్మ్ స్ట్రాంగా
చెక్కిలిని దోచినది నేనేగా అరె నేనేగా
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
కలల దేవతకీ పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
సాహిత్యం: భువనచంద్ర
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri