ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నులు కలువల్లో సరిగమలపరాగాలు
శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
♪
ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో
పల్లవించే నా గీతం పలకరించే సంగీతం
ఆ స్వర్గానికి నిచ్చన వేసిన నా ఆవేశంలో
తరుముకొచ్చే ఉల్లాసం తలను వంచే కైలాసం
ఒక్కసారి వస్తాయి తియ్యని క్షణాలెన్నో
ఒక్కటవ్వమంటూ తీరని రుణాలే
శుభలేఖనుకో నా గీతం
♪
నీ పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో
దేవతాయే ని రూపం దీవెనాయే నా ప్రాణం
వయ్యారాలు ఉయ్యాలూపిన ఈ వైభోగంలో
మౌనం ఆయే నా భావం రాగం ఆయే నీకోసం
మూడుమూళ్ళ బంధం ఏడు జన్మల అనుబంధం
వేణువైన నాలో ఆలాపనయినా గానం
ఆశిసు అనుకో అనురాగం
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు
మధుమాసం మనసుకు వచ్చే వేళలో
కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు
శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో
ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి
కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri