స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాతవేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండుగుండెల ఏకతాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమగీతమో
లేలేత పూలబాసలు కాలేవా చేతిరాతలు
స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాతవేళ శుభమస్తు గాలి వీచే
♪
నీదే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం
ప్రేమా నేనూ రేయిపగలు హారాలల్లే మల్లెలు నీకోసం
కోటిచుక్కలు అష్టదిక్కులు నిన్ను చూచువేళ
నిండుఆశలే రెండుకన్నులై చూస్తే నే రాలా
కాలాలే ఆగిపోయినా గానాలే మూగబోవునా
♪
నాలో మోహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం గెలిచే బంధం రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా మనసు తోడుగా మలుచుకున్న బంధం
పెనుతుఫానులే ఎదురువచ్చినా చేరాలి తీరం
వారేవా ప్రేమపావురం వాలేదే ప్రణయగోపురం
స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాతవేళ శుభమస్తు గాలి వీచే
జోడైన రెండుగుండెల ఏకతాళమో
జోరైన యవ్వనాలలో ప్రేమగీతమో
లేలేత పూలబాసలు కాలేవా చేతిరాతలు
స్వప్నవేణువేదో సంగీతమాలపించే
సుప్రభాతవేళ శుభమస్తు గాలి వీచే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri