ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
అల్లుకున్న బంధాలు చల్లుతున్న చందనాలు
వెల్లువైన వేళలో తిరిగి తెల్లవారే
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
♪
అన్నయ్యా నీ అలక పైపైనేనని తెలుసునులేవయ్య
తమ్ముడూ నీకు తెలుసన్న సంగతి నాకు తెలుసయ్య
ఎన్ని కళలో... వెంటతెచ్చెనంట చూడ ముచ్చటైన మురిపెం
ఎన్ని సిరులో... రాసిపోసెనంట సంకురాత్రి వంటి సమయం
మనసే కోరే, అనుబంధాలు దరిచేరే
తరతరాల తరగని వరాలగని అని
మనింటి మమతని మరిమరి పొగిడిన పదుగురి కను వెలుగై
సాగుతున్న వేళలో మనది పూలదారే
ఛాంగురే ఛాంగురే మమత నిను కోరే
ఛాంగురే ఛాంగురే చెలిమి నిను చేరే
♪
కొమ్మలో కోయిలను కమ్మగ లేపిన కిలకిల సంగీతం
గొంతులో మేలుకొని కోటి మువ్వల కొంటె కోలాటం
ఎంత వరమో... రామచంద్రుడంటి అన్నగారి అనురాగం
ఏమి రుణమో... లక్ష్మణుణ్ని మించి చిన్నవాని అనుబంధం
ఇపుడే చేరే పది ఉగాదులొకసారే
ప్రియ స్వరాలు చిలికిన వసంత వనముగ
అనేక జన్మల చిగురులు తొడిగిన చెలిమికి కలకాలం
స్వాగతాలు పాడనీ సంబరాల హోరే
ఛాంగురే ఛాంగురే
ఛాంగురే ఛాంగురే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri