ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుంది తియ్యని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు ♪ పాటలా వినిపించే ఆమె ప్రతి పలుకు హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకు వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు చీకటి చెరిగేలా ఆ కంటి చూపు వేకువ జామున వాకిట వెలిసే వన్నెల వాసంతం ముగ్గుల నడుమన సిగ్గులు జల్లే నా చెలి మందారం ఎంత చేరువై వుంటే అంత సంబరం ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు ♪ ఏటిలో తరగల్లే ఆగనంటుంది ఎదురుగా నేనుంటే మూగబోతోంది కంటికి కునుకంటూ రాను పొమ్మంది మనసుతో ఆ చూపే ఆడుకుంటోంది ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభ సమయం అందాకా మరి ఆగాలంటే వింటుందా హృదయం వేచివున్న ప్రతి నిముషం వింత అనుభవం ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు ఇనాళ్ళకు దొరికింది ఓ చెలి స్నేహం ఇపుడే అది కానుంది తియ్యని బంధం శుభలేఖలు పంపే మంచి ముహూర్తం పరుగున వస్తుంది ప్రేమా ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు