Kishore Kumar Hits

Nagarjuna - Voddura Sodhara şarkı sözleri

Sanatçı: Nagarjuna

albüm: Manmadhudu


హా... శభాష్
సగమపా నీప... మపగా... రీసనీప... మపనీస
రేయ్ వద్దురా సోదరా, అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెలెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్

వద్దురా

వద్దు వద్దురా సోదరా, అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెలెళ్ళి గోతిలో పడొద్దురా
చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలుజారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి
కళ్యాణమే ఖైదురా, జన్మంతా విడుదల లేదురా
నీ కొంప ముంచేస్తుందిరా ఆపుకోలేని ఈ తొందర
Don't marry hey be happy ho
Don't marry hey be happy ey ey ey
Don't marry hey be happy ho
Don't marry hey be happy happy happy happy
వద్దురా సోదరా, అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెలెళ్ళి గోతిలో పడొద్దురా

శివ అని నా close friend, love లో పడి పెళ్ళి చేసుకున్నాడు
College లో వాడు గ్రీకు వీరుడు, marriage కాకముందు రాకుమారుడు
అంతా జరిగి just one month-u కాలేదు
ఎంత మారిపోయాడో గుర్తుపట్టలేనట్టు
బక్క చిక్కిపోయి, మంచి look-u పోయి
ఫేసు పాలిపోయి, జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటు
గుక్కపెట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందుకొట్టి flashback చెప్పాడు
పొద్దున్నలేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే తనకి I love you చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తి సామైందిరా కాపురం, పెళ్ళి క్షమించరాని నేరం
Don't marry hey be happy హ
Don't marry hey be happy ey ey ey
Don't marry hey be happy ho
Don't marry hey be happy happy happy happy
వద్దురా సోదరా, అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెలెళ్ళిళ్ళి గోతిలో పడొద్దురా వద్దుర వద్దు

అంతెందుకు మా మల్లిగాడు, మా ఊళ్ళో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దేశముదురు
పెళ్ళితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పడ్లేక ఇంటిపోరు
చల్లారిపోయింది వాడినెత్తురు
ఒక్కపుట కూడా ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్రతినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదట వీధి వెంట
కోడెనాగు లాంటి వాడ్ని వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల కలిగించింది భక్తి యోగం
ఆ ఇల్లాలి దయవల్ల కనిపించింది ముక్తి మార్గం
సంసారమే waste అని, ఇక సన్యాసమే best అని
కాషాయమే కట్టాడురా, కట్టి కాశీకి పోయాడురా
Don't marry hey be happy ho
Don't marry hey be happy ey ey ey
Don't marry hey be happy ho
Don't marry hey be happy happy happy happy
వద్దురా సోదరా అరె పెళ్ళంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెలెళ్ళి గోతిలో పడొద్దురా
Don't marry hey be happy హ
Don't marry, never, be happy yes yes yes
Don't marry ఆహా be happy హా హా హా
Don't marry hey be happy happy happy happy happy happy

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar