(చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క)
♪
(చెమ్మ చెక్క చెమ్మ చెక్క
చెమ్మ చెక్క చెమ్మ చెక్క)
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళిసందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
♪
ఊరు వాడ వచ్చి ఈడు జోడు మెచ్చి సంబరంగా చూస్తారంట
కన్న వారు వచ్చి కన్నె దానమిచ్చి కంటనీరు పెడతారంట
తడి కళ్ళే ప్రమిధలుగా వెలిగే పందిరిలోనా
పరవళ్ళే అందెలుగా ఆడే అనందానా
పిట్ట కూత పంచె కట్టుకుంది మంత్రాలు వల్లిస్తూ
పిల్ల గాలి పెళ్లి పెద్దయ్యింది పన్నీరు చల్లిస్తూ
పెళ్లి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
♪
పట్టు చీర కట్టి పూల జడ చుట్టి కొత్త కళ మురిసే వేళ
వాన విల్లు వంటి జాణ వన్నెలంటి వెయ్యి కళ్ళు మెరిసే వేళ
నిలువెల్లా విరిసింది పులకింతల పూదోటా
విరిముళ్ళే విసిరింది పురి విప్పిన సయ్యాటా
ఆడ జన్మ మేలుకుంది చూడు సరికొత్త రూపంతో
అంగరంగ వైభవంగ నేడు జరిపించు వేడుకతో
పెళ్లి సందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
సరదాల సంగీతంతో చెలరేగింది సన్నాయి
బరువైన సంతోషంతో తలవంచింది అమ్మాయి
పెళ్ళిసందళ్ళలో
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
చెమ్మ చెక్క చెమ్మ చెక్క చేమంతులోయ్
చెంప చుక్క చెంప చుక్క సంపెంగలోయ్
కన్నె బుగ్గ కన్నె బుగ్గ కవ్వింతలోయ్
సిగ్గు మొగ్గ సిగ్గు మొగ్గ తుళ్ళింతలోయ్
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri