Kishore Kumar Hits

Nagarjuna - Kanyakumari şarkı sözleri

Sanatçı: Nagarjuna

albüm: Damarukam


కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ మీనాకుమారి
నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ
వేసవి కన్నా వెచ్చగ నాతో ముచ్చటలాడాలి
వెన్నెల కన్నా చల్లగ నాకే కౌగిలి ఇవ్వాలి
చక్కెర కన్నా తియ్యగ నన్నే ప్రేమించాలి
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల
రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
హో నీ మీసం చూసి మెలితిరిగెను వయ్యారం
అది తాకితే చాలు నిదరేరాని రేయిక జాగారం
నడుమే నయగారం ఆ నడకే సింగారం
నీ నడుమున నలిగే మడతకు చేస్తా ముద్దుల అభిషేకం
కళ్లతో నన్నే గారాడి చేయకు మదనుడి మరిదివలే
కళ్లే మూసి చల్లగ జారకు పూబంతల్లే
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల
రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
మీనాకుమారి ఓ మీనాకుమారి
నీ కళ్లల్లోన ఉండాలంటే ఏంచెయ్యాలే నారీ
హో సూటిగ నీ చూపే నా గుండెను తాకింది
పేరే తెలియని జ్వరమే ఏదో ఒంటికి సోకింది
నీలో నిప్పుంది అది నాలో రగిలింది
ఎదలొకటై తెలవారే వరకు ఆరను లెమ్మంది
ఉక్కిరిబిక్కిరి చేసే కోరిక ఎరుగదు ఇదివరకు
ఒంటిరి తుంటిరి తుమ్మెదలాగా అంటుకుపోకు
రావే నీ పేరు వెనక నా పేరు పెడతా మధుబాల
రారా నీ ముద్దుమాటకు నా సోకులిస్తా గోపాలా
కన్యాకుమారి ఓ కన్యాకుమారి
నీ గుండెల్లోకి చేరాలంటే ఎటువైపమ్మా దారి
రాజ కుమారా ఓ రాజ కుమారా
నా గుండెల్లోనే ఉన్నావయ్యో ఎందుకు ఇంకా దారి

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar