నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వు, నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగ
ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగ
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
♪
నువ్వంటే ఎంతిష్టం, సరిపోదే ఆకాశం
నాకన్నా నువ్విష్టం, చూశావా ఈ చిత్రం
కనుపాపలోనా నీదే కల
ఎద ఏటిలోనా నువ్వే అల
క్షణకాలమైనా చాల్లే ఇలా
అది నాకు వెయ్యేళ్ళే
ఇక ఈ క్షణం కాలమే ఆగిపోవాలే
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
♪
అలుపొస్తే తల నిమిరే చెలిమౌతా నీకోసం
నిదరొస్తే తల వాల్చే ఒడినౌతా నీకోసం
పెదవంచుపైనా నువ్వే కదా
పైటంచుమీదా నువ్వే కదా
నడుమొంపులోనా నువ్వే కదా
ప్రతిచోట నువ్వేలే
అరచేతిలో రేఖలా మారిపోయావే
నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri