ఏమో ఏమో ఏమో
మెరుపుతీగ ఎదురై నవ్విందేమో
ఏమో ఏమో ఏమో
వెలుగువాగు నాలో పొంగిందేమో
ఉందో లేదో ఏమో
కాలికింద నేలే కరిగిందేమో
మాయో మహిమో ఏమో
నేలకాస్త నింగై మెరిసిందేమో
ఇన్నాళ్లుగా ఇలాంటి వింత కంట చూడలేదే
ఇలాంటిదేదో ఉన్నదంటే విన్నమాట కాదే
రాదే రాదే రాదే
నెమలికన్ను కలలో రూపం నీదే
రాదే రాదే రాదే
ఎడమవైపు ఎదలో దీపం నీదే
లేదే లేనేలేదే
ఇంత గొప్ప అందం ఇలలో లేదే
ఉండే ఉంటే ముందే
చూసినట్టు ఎవరూ అననే లేదే
పోల్చేదెలా ఇలా అని నీలాగ ఉంది నువ్వే
నమ్మేదెలా నిజం అని సమ్మోహపరచినావే
లాలీ లాలీ అంటూ
జోలపాట పాడే పవనం నువ్వే
లేలే లేలే అంటూ
మేలుకొలుపు పాడే కిరణం నువ్వే
నాలో భావం నువ్వే
రూపుకట్టి ఇల్లా ఎదురయ్యావే
నాలో జీవం నువ్వే
ఆశపెట్టి ననిలా కవ్విస్తావే
లోలోన దాచుకున్న నా అందాల ఊహ నువ్వే
నా చెంత చేరి ఇంతలా దోబూచులాడినావే
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri