చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
♪
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ
♪
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ
నేనున్నాననీ నీకేంకాదని
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
♪
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరూవున్నా అప్తుడు నువ్వై చేరువయ్యావనీ
జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నావనీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావనీ
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
♪
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేంకాదని
నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri