ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతమా
వచ్చిరాని వయ్యారాలే వయసాయే
మళ్ళి మళ్ళి సాయంత్రాలే మనసాయే
నిజమా
హమ్మమ్మా
♪
చిలిపి కనులా కబురు వింటే
బిడియమో ఏమో సుడులు రేగిందీ
పెదవి తొనలా మెరుపు కంటే
ఉరుములా నాలో ఉడుకు రేగిందీ
గుబులో దిగులో వగలై పోయే వేళలో
తనువూ తనువూ తపనై తాకే వేడిలో
మల్లీ జాజీ జున్నులా చలి వెన్నెలా ముసిరేనిలా
నిజమా
హమ్మమా
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతమా
♪
చిగురు తొడిగే సొగసు కంటే
పొగరుగా ప్రాయం రగిలిపోయిందీ
ఉలికి నడుమూ కదుపుతుంటే
తొలకరింతల్లో తొడిమరాలిందీ
కుడివై పదిరే శకునాలన్నీ హాయిలే
ప్రియమో యేమో నయగారాలే నీదిలే
గోరింటాకు పూపొదా చలి ఆపదా ఇక ఆపదా
నిజమా
అమ్మమ్మా
ఎంత ఘాటు ప్రేమయో పారిజాతమా
ఏటవాలు చూపులో మౌన గీతమా
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri