Kishore Kumar Hits

Chiranjeevi - Yeeno Yenno şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Golden Hits Of Sirivennela Seetharama Sastry


(ఓ daddy, daddy love you
ఓ mummy, mummy love you
We love you, love you, love you so much)
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా
ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత
ఏ పూటైనా happyగా ఉందాం, మనకొద్దు అంతకు మించి వేరే వేదాంతం
ఏ బాటైనా పరవాలేదంట సమయంతో సాగటమే మన simple సిద్ధాంతం
చిరుగాలికి పరిమళమిచ్చే సిరి మల్లెల వనమై ఉందాం
గగనాన్ని నేలను కలిపే హరివిల్లుల వంతెన అవుదాం
ఆనందం అంటే అర్థం మనమందాం
ప్రతి పూట పాటై సాగే హుషారు సరిగమలో
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా
చలాకి నవ్వుల కేరింత
(ఓ daddy, daddy love you
ఓ mummy, mummy love you
We love you, love you, love you so much)
మమకారాలే పువ్వుల సంకెళ్ళై గత జన్మల ఋణబంధాలను గుర్తుకు తెస్తాయి
అనురాగాలే గుండెల సవ్వల్లై బతుకంటే ఎంతో తీపని చెబుతూ ఉన్నాయి
వరమల్లె దొరికినదేమో అరుదైన ఈ అనుబంధం
సిరులున్నా దొరకనిదేమో సరదాలకు ఈ సావాసం
చిరకాలం చిగురులు వేస్తూ ఎదగాలి
ఏ చింతా చెంతకు రాని అందాల ఈ సందడి
ఎన్నో ఎన్నో రాగాలుండే సంగీతం కాదా చలాకి నవ్వుల కేరింత
ఎన్నో ఎన్నో రంగులు చిందే సంబరమే రాదా ఇలాగే నిత్యం మన వెంట
సంద్రంలో సందడంతా
చంద్రుడిలో వెన్నెలంతా
చిన్నారి సంతానంగా చేరె మన ఇంట

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar