కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తొడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశా చితికెస్తే చాలమ్మ అందానిదెంవుంది
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
♪
గున్నమావి గొంతులో తేనె తీపి నింపుతూ కోయిలమ్మ చేరుకున్నది
ఎండమావి దారిలో పంచదార వాగులా కొత్త పాట సాగుతున్నది
వొంటరైన గుండెల్లో అనందాల అందెలతో ఆడే సందడీది
అల్లిబిల్లి కాంతులతో యెకాంతాల చీకటినీ తరిమె బంధమిది
కలతేరగని కళలను చూడు కంటికి కావాలి నేనుంట
కలతరగని వెలుగులు నేడు ఇంటికి తోరణం అనుకుంట
♪
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
♪
పంచుకున్న ఉసులు పెంచుకున్న అసలు తుళ్ళి తుళ్ళి ఆడుతున్నవి
కంచె లేని వుహలే పంచె వన్నె గువ్వలై నింగి అంచు తాకుతున్నవి
కొత్త జల్లు కురిసింది బ్రతికే చిగురు తొడిగేలా వరంమై ఈ వేళ
వానవిల్లు విరిసింది మిన్ను మన్ను కలిసేలా ఎగసే ఈ వేళ
అనువనువును తడిపిన ఈ తడి అమృతవర్షిణి అనుకోనా
అడుగఅడుగున పచ్చని బాటను పరిచిన వనమును చూస్తున్న
కన్నుల లోగిలిలో వెన్నెల విరిసింది
చల్లని జాబిలితో స్నేహం కుదిరింది
చెలిమి తొడుంటే చాలమ్మ లేనిది ఏముంది
ఆశా చిటికెస్తే చాలమ్మ అందానిదెంవుంది
Поcмотреть все песни артиста
Sanatçının diğer albümleri