Kishore Kumar Hits

Chiranjeevi - Theli Manchu şarkı sözleri

Sanatçı: Chiranjeevi

albüm: Golden Hits Of Sirivennela Seetharama Sastry


తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భానుమూర్తీ
నీ ప్రాణ కీర్తన వినీ
పలుకని ప్రణతులని ప్రణవ శృతిని
పాడని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు
పసరు పవనాలలో పసి కూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు
తలయుచూ
కలిరాకు బహుపరాకులు విని
దొరలని దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ
నీ దోవ పొడవునా కువకువల స్వాగతం
నీ కాలి అలికిడికి మెలకువల వందనం
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ

Поcмотреть все песни артиста

Sanatçının diğer albümleri

Benzer Sanatçılar